బ్రేకింగ్ న్యూస్

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను మరోసారి జైలుకు తరలించారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ఆయనను రావల్పిండిలోని అడియాలా జైలుకు తీసుకెళ్లినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనను తొలుత షిఫా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం తిరిగి జైలుకు పంపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు, తిరిగి జైలుకు పంపడం వంటి పరిణామాలపై పీటీఐ నేతలు, ఆయన మద్దతుదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు.