సుగాలి ప్రీతి మృతికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె తల్లి సుగాలి పార్వతీ చేపట్టిన వీల్‌చైర్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సుగాలి పార్వతీ బంధువులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా సుగాలి పార్వతీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె మరణించి బుధవారంతో తొమ్మిదేళ్లు పూర్తయినా ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు.
“నా కూతుర్ని చంపి తొమ్మిదేళ్లు అవుతోంది. అయినా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. నా కూతురి మరణానికి కారణమైన నిందితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది” అని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వీల్‌చైర్ యాత్ర చేపట్టానని, అయితే ఆ యాత్రను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారని సుగాలి పార్వతీ విమర్శించారు. తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.