గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపడేలా శిక్షిస్తామని స్పష్టం చేశారు. యువత ప్రతిభను గుర్తిస్తామని, ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
తప్పు చేయాలంటే భయపడేలా శిక్షిస్తాం: చంద్రబాబు