సినిమా

ఓటీటీలోకి ‘శ్రీనివాస మంగాపురం’

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నాయికగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం థియేటర్లలో విడుదలై 20 రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వైవిధ్య చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పి. కిరణ్ నిర్మించారు.