సినిమా

వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రం

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రానికి ముహూర్తం ఖరారైంది. ‘బింబిసార’ చిత్ర దర్శకుడు మల్లాడి వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ తన తొలి చిత్రాన్ని ప్రారంభించనున్నారు. సోషియో-ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను విజయదశమి పర్వదినాన లాంఛనంగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. బాలకృష్ణ ఇటీవల గాయపడటంతో ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.