నల్గొండ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి (45) దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రేపు ప్రైవేట్ స్కూళ్ల బంద్కు పిలుపునిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. రూపారెడ్డి హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రిన్సిపాల్ హత్యపై నిరసనగా రేపు ప్రైవేట్ స్కూళ్లు బంద్ కానున్నాయి.