ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు.

జగన్‌ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జలవిహార్‌లోని గ్రాండ్‌ లాన్స్‌కు వెళ్లి, ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు వివాహ వేడుకలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరనున్నారు. జగన్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆయన రాక, తిరుగు ప్రయాణానికి అనుగుణంగా భద్రతా చర్యలను సమన్వయం చేస్తున్నారు.