తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 27 నుంచి లాటరీ

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎల్‌ఐజీ (LIG) ఫ్లాట్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. 27 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు లాటరీ నిర్వహించనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున అర్హుల ఎంపిక చేపట్టనున్నారు.

లాటరీకి సంబంధించిన అర్హుల ప్రాథమిక జాబితాను గురువారం సాయంత్రం అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ వరకు స్వీకరించనున్నారు. అందిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించిన అనంతరం అర్హుల తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.

తుది జాబితా ఆధారంగానే 27 నుంచి లాటరీ ప్రక్రియ కొనసాగుతుందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు. లాటరీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఎల్‌ఐజీ ఫ్లాట్లను కేటాయించనున్నారు.