ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి గొట్టిపాటి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వెలిగొండ నిర్వాసితులను తీవ్రంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవి.. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు దాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తున్నది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు దాదాపు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోందని చెప్పారు.
ఈ నెలలోనే నల్లమలసాగర్‌కు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో సాగునీరు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.