అంతర్జాతీయం

భారత్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్య భాగం: అమెరికా దౌత్యవేత్త

జమ్మూకశ్మీర్‎పై అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో జమ్మూకశ్మీర్ ఒక ముఖ్యమైన భాగమని, ఈ ప్రాంతం ఇప్పుడు మరింత సురక్షితంగా మారిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం శ్రీనగర్ చేరుకున్న గోర్, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌కు జారీ చేసిన అత్యున్నత స్థాయి ప్రయాణ హెచ్చరికను తగ్గించే విషయాన్ని అమెరికా పునఃపరిశీలిస్తుందని తెలిపారు.