జాతీయం

పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

దేశంలోని వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను వేగవంతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అమలు పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సబ్జెక్ట్ నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్, ఉచిత నాణ్యమైన కంటెంట్, నిపుణుల సలహాలు, సందేహాల నివృత్తికి అవకాశం లభిస్తుంది. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు ఈ ఉచిత డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ వెల్లడించనుంది.