ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులను సురక్షితంగా తీసుకొస్తాం: అచ్చెన్న

ముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం పరామర్శించారు. బాధిత మత్స్యకార కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, మత్స్యకారులను సురక్షితంగా తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.