తెలంగాణ

కులగణనలో బీసీలను చేర్చాలి: మంత్రి పొన్నం

TG: కులగణనలో బీసీ కేటగిరీని తప్పనిసరిగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీసీల ఖచ్చితమైన జనాభా, సామాజిక పరిస్థితులపై స్పష్టమైన ఆధారాలు లేకపోతే వారికి తగిన న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. బీసీ వర్గాల సంక్షేమం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, వారి ఉద్దేశాన్ని మంత్రి ప్రశ్నించారు.