పంజాబ్లోని మొహాలీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు.
భవనం కూలిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి కార్మికులను బయటకు తీసి చికిత్స కోసం తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.