అంతర్జాతీయం

రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

TG: బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీనియర్ నేతలకు కీలక పదవులు దక్కేవని, కానీ ఈసారి ఒక్కరికి కూడా చోటు దక్కలేదని తెలిపారు. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని, దీనివల్లే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర నేతలు విభేదాలు, సొంత ప్రయోజనాలు పక్కనబెట్టి, ఐక్యంగా పోరాడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.