తెలంగాణ

సినిమా టికెట్‌ ధరల పెంపు.. నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

సినిమా టికెట్ల ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ప్రభుత్వం TGFDC, ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్ఫేర్ అసోసియేషన్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ‘అఖండ 2’, ‘ది రాజాసాబ్‌’, ‘మన శంకర వరప్రసాద్‌ గారు’, ‘పెద్ది’ వంటి సినిమాల టికెట్ ధరల పెంపు ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని ఎగ్జిబిటర్ల నుండి వసూలు చేసి జమ చేయాలని నిర్మాతలకు సూచించింది. ఈ నిధులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.