ఆంధ్రప్రదేశ్

గ్రూప్ 1 నియామకాలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్

AP: గ్రూప్ 1 నియామకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం వ్యవస్థలను విధ్వంసం చేసిందని, ప్రజావేదిక కూల్చివేతతో ఈ విధ్వంసం ప్రారంభమైందని ఆయన అన్నారు. 2018లో తామే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని, అయితే 2021లో స్టే వచ్చిందని తెలిపారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించినా, ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆ పనిని ప్రైవేటు సంస్థకు అప్పగించారని చంద్రబాబు ఆరోపించారు.